పాకిస్థాన్‌కు త్వరలో భారీ షాక్.. సీన్‌ చూస్తే అర్థమవుతోంది..!

| Edited By:

Apr 07, 2020 | 6:10 PM

పాకిస్థాన్‌కు మరోసారి భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే ఓ సారి చైనా వెనకేసుకురావడంతో బ్లాక్‌ లిస్టులో పడకుండా తప్పించుకుని.. గ్రే లిస్టులో పడింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చూసుకోవాల్సిన పాక్ ప్రభుత్వం.. వాటిపై చర్యలేమీ తీసుకోకుండా వదిలేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్.. పాకిస్థాన్‌ను పలుమార్లు హెచ్చరించింది. ఎన్నిసార్లు చెప్పినా.. పాక్ వ్యవహారంలో మార్పు రాలేదు. గతంలోనే పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టబోతున్నట్లు డైరక్ట్‌గా హెచ్చరించినా.. చైనా ఎంటర్‌ అవ్వడంతో.. […]

పాకిస్థాన్‌కు త్వరలో భారీ షాక్.. సీన్‌ చూస్తే అర్థమవుతోంది..!
Follow us on

పాకిస్థాన్‌కు మరోసారి భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే ఓ సారి చైనా వెనకేసుకురావడంతో బ్లాక్‌ లిస్టులో పడకుండా తప్పించుకుని.. గ్రే లిస్టులో పడింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చూసుకోవాల్సిన పాక్ ప్రభుత్వం.. వాటిపై చర్యలేమీ తీసుకోకుండా వదిలేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్.. పాకిస్థాన్‌ను పలుమార్లు హెచ్చరించింది. ఎన్నిసార్లు చెప్పినా.. పాక్ వ్యవహారంలో మార్పు రాలేదు. గతంలోనే పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టబోతున్నట్లు డైరక్ట్‌గా హెచ్చరించినా.. చైనా ఎంటర్‌ అవ్వడంతో.. బతికిబయటపడింది. లేకపోతే.. పాకిస్థాన్‌ ఎప్పుడో బ్లాక్‌ లిస్టులో పడేది.

అయితే తాజాగా.. పాక్ తీరుపై మరోసారి చర్యలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై జూన్‌లో.. చైనాలో జరిగే ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశంలో చర్చించనుంది. అయితే గతంలో చైనా వెనకేసుకొచ్చినా.. పాక్‌ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. కాబట్టి ఈ సారి పాక్‌ బ్లాక్‌ లిస్టులో పడడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. ఇక పాకిస్థాన్‌ ప్రపంచముందు ఒంటరిగా మిగిలిపోతుంది. ఏ దేశం కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రాదు.