AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 వ రోజుకు చేరిన రైతుల నిరసన, ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ సరిహద్దును ఆక్రమిస్తాం, అన్నదాతల హెచ్చరిక

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ సింఘు బోర్డర్ లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనఆదివారం నాటికి 25 వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ బోర్డర్ ను..

25 వ రోజుకు చేరిన రైతుల నిరసన, ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ సరిహద్దును ఆక్రమిస్తాం, అన్నదాతల హెచ్చరిక
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Dec 20, 2020 | 12:32 PM

Share

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ సింఘు బోర్డర్ లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనఆదివారం నాటికి 25 వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ బోర్డర్ ను తాము ఆక్రమిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.  నిరసన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు సంతాపంగా దేశవ్యాప్తంగా శ్రధ్ధాంజలి ఘటిస్తామని ఈ సంఘాలు పేర్కొన్నాయి. గ్రామ, బ్లాకు స్థాయిలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు  శ్రధ్ధాంజలి దివస్ కార్యక్రమాన్ని పాటిస్తామని స్పష్టం చేశాయి. కాగా తమ ఆందోళనతో ఏ రాజకీయపార్టీకీ సంబంధం లేదని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రధాని మోదీకి, వ్యవసాయ శాఖ ,మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు సుదీర్ఘ లేఖ రాసింది. తమ ఆందోళనను ప్రతిపక్షాలు రెచ్ఛగొడుతున్నాయని, తమ నిరసన వెనుక వారి హస్తం ఉందని మోదీ, బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఈ కమిటీ ఖండించింది.

ఇది తప్పుడు అభిప్రాయమని, తమ ప్రొటెస్ట్ వెనుక ఈ పార్టీ  కూడా లేదని స్పష్టం చేసింది.  మా రైతుల్లో ఏ యూనియన్ కి గానీ, చిన్న, లేదా పెద్ద సంఘానికి గానీ ఏ పొలిటికల్ పార్టీ తో సంబంధం లేదు. ఈ విషయాన్ని గ్రహించండి అని ఈ కమిటీ నేతలు పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన మూడు చట్టాల్లో ఎన్నో లొసుగులు ఉన్నాయని, ప్రధాన సమస్యలనుంచి రైతుల దృష్టిని మళ్లించడానికి మీరు యత్నిస్తున్నారని తోమర్ కు రాసిన లేఖలో వీరు ఆరోపించారు. అటు-హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న తోమర్ తో భేటీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో మళ్ళీ చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆ తరువాత చెప్పారు.