
Fake village volunteers: గుర్తుతెలియని వ్యక్తులు వాలంటీర్లమని ఎవరైన ఇంటి వద్దకు వస్తే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలులో వాలంటీర్లమంటూ వచ్చి ఓ వృద్దురాలి ఒంటి పై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే, కర్నూలులోని స్టాంటన్‌పురంలో నివాసం ఉంటోంది లక్మీ దేవి. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారంటీర్ అని ఓ మహిళా దొంగ మరో దుండగుడు వచ్చి టీకా వేస్తామని పరిచయం చేసుకున్నారు.
ఇంటి పత్రాలు ఇవ్వాలని అడగ్గా అనుమానం వచ్చిన లక్ష్మీ దేవి నాకు ఏమీ అవసరం లేదు వెళ్లిపోండని చెప్పింది. అంతే.. అసలు రూపం బయటపెట్టిన వీళ్లిద్దరూ, లక్ష్మీదేవి నోటికి ప్లాస్టర్ వేసి పెప్పర్ స్ప్రే కంట్లో కొట్టి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, గాజులు దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై తాలూకా పోలీసు స్టేషన్లో కేసు నమెదు చేశారు.