టిక్‌టాక్‌లో ప్రేమ.. ఆపై అత్యాచారం..

టిక్‌టాక్‌లో ప్రేమ పేరుతో యువతిని నమ్మించిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీకి చెందిన ఓ యువతి(27)కి గతేడాది డిసెంబర్‌లో నషేమన్‌నగర్ వాసి అయిన అక్బర్ షా(34)తో టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. ఇక ఆ యువతిని అతడు ప్రేమ పేరుతో నమ్మించి బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు పరారయ్యాడు. దీనితో బాధితురాలు ఏమి చేయాలో తెలియక […]

టిక్‌టాక్‌లో ప్రేమ.. ఆపై అత్యాచారం..

Updated on: May 18, 2020 | 7:57 PM

టిక్‌టాక్‌లో ప్రేమ పేరుతో యువతిని నమ్మించిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీకి చెందిన ఓ యువతి(27)కి గతేడాది డిసెంబర్‌లో నషేమన్‌నగర్ వాసి అయిన అక్బర్ షా(34)తో టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది.

ఇక ఆ యువతిని అతడు ప్రేమ పేరుతో నమ్మించి బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు పరారయ్యాడు. దీనితో బాధితురాలు ఏమి చేయాలో తెలియక చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసి నిందితుడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.