లాక్‌డౌన్ తో మద్యం షాపులు మూసివేత : కిక్కు కోసం మరో మార్గం

|

Apr 23, 2020 | 3:10 PM

కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. గత నెల 22వ తేదీన కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ ఒక్క రోజుకే పరిమితం అవుతుందని, లాక్‌డౌన్‌ రూపంలో మరో సాహసోపేతమైన కఠిన నిర్ణయం వెలువడుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పటికే సర్కారీ మద్యం షాపుల్లో మద్యం నిల్వలను ఫుల్లుగా నింపేశారు నిర్వాహకులు. అయితే 23వ తేదీ నుంచి మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులు […]

లాక్‌డౌన్ తో మద్యం షాపులు మూసివేత : కిక్కు కోసం మరో మార్గం
Follow us on

కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. గత నెల 22వ తేదీన కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ ఒక్క రోజుకే పరిమితం అవుతుందని, లాక్‌డౌన్‌ రూపంలో మరో సాహసోపేతమైన కఠిన నిర్ణయం వెలువడుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పటికే సర్కారీ మద్యం షాపుల్లో మద్యం నిల్వలను ఫుల్లుగా నింపేశారు నిర్వాహకులు. అయితే 23వ తేదీ నుంచి మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తయారీపై నిషేధాజ్ఞలు ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రా-ఒడిషా రాష్ట్రాల మధ్య సుమారు 45 కిలోమీటర్ల మేర సరిహద్దు విస్తరించి ఉండటం, ఆ రాష్ట్రంలో ప్రభుత్వమే నాటుసారా విక్రయాలు చేపట్టడంతో అక్కడ తయారవుతున్న నాటుసారాను అక్రమ మార్గాల ద్వారా జిల్లాలకు తరలించి విక్రయాలు చేపడుతున్నారు సారా వ్యాపారులు. అలా ఇటీవల కూరగాయల రవాణా ముసుగులో సుమారు నాలుగు వేల సారా ప్యాకెట్లను తరలిస్తున్న ఒక వ్యాన్‌ పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల తనిఖీల్లో పట్టుపడింది. దీంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నాటుసారా అక్రమ దిగుమతిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు.