పాక్ వక్రబుద్ధి.. నకిలీ కరెన్సీని ముద్రించి.. బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి పంపుతూ..

| Edited By:

Mar 21, 2019 | 11:56 AM

పాకిస్థాన్ తన పంథాను మార్చింది. ఏలాగైనా భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయాలన్ని వక్రబుద్ధితో భారత కరెన్సీని ముద్రిస్తూ ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, దాన్ని బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి పంపుతోంది. ఇండియాలో చలామణిలో ఉన్న అసలైన కరెన్సీ మాదిరిగానే ఈ కరెన్సీ కూడా ఉంటోంది. కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ లేకున్నా, చూడగానే, అసలైన కరెన్సీ మాదిరే కనిపిస్తుండటంతో ఇవి ఇండియాలో చలామణిలో ఉన్నాయి. దీన్ని […]

పాక్ వక్రబుద్ధి.. నకిలీ కరెన్సీని ముద్రించి.. బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి పంపుతూ..
Follow us on

పాకిస్థాన్ తన పంథాను మార్చింది. ఏలాగైనా భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయాలన్ని వక్రబుద్ధితో భారత కరెన్సీని ముద్రిస్తూ ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, దాన్ని బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి పంపుతోంది. ఇండియాలో చలామణిలో ఉన్న అసలైన కరెన్సీ మాదిరిగానే ఈ కరెన్సీ కూడా ఉంటోంది. కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ లేకున్నా, చూడగానే, అసలైన కరెన్సీ మాదిరే కనిపిస్తుండటంతో ఇవి ఇండియాలో చలామణిలో ఉన్నాయి. దీన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో బండ్లగూడకు చెందిన మహ్మద్‌ గౌస్‌ అనే పండ్ల వ్యాపారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాక్ లోని కెట్వాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రిస్తున్న కరెన్సీని తొలుత బంగ్లాదేశ్ కు తరలించి, ఆపై, కోల్ కతా మీదుగా ఇండియాలోకి పంపుతున్నారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా కేంద్రంగా ఈ దందా సాగుతోందని కూడా పోలీసులు గుర్తించారు. ఆ రాష్ట్రంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కృష్ణాపూర్‌ కు చెందిన అమీనుల్‌ రెహ్మాన్‌ అలియాస్‌ బబ్లూతో పరిచయం పెంచుకున్న గౌస్, లక్ష నకిలీ కరెన్సీకి రూ. 40 వేలు ఇస్తూ, డబ్బు తెప్పించి చలామణి చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో బబ్లూను చేర్చి అతని కోసం గాలింపు ప్రారంభించారు. కాగా ఇతనిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.