అర్థరాత్రి చిత్తూరులో పిచ్చకామెడీ.!

చిత్తూరులో అర్థరాత్రి ఫోన్ కలకలం. ఏసీబీ డీఎస్పీనంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పీఏకు హరికృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తనని తాను ఏసీబీ డీఎస్పీ హరిగా పరిచయం చేసుకున్నాడు. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అందించాడు. తాము దాడిచేస్తూ ఉన్నఫలంగా వచ్చి చిత్తూరులో ఒక లాడ్జ్ లో ఉన్నామని.. తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు డబ్బులు పంపాలని హరికృష్ణ సదరు ఎమ్మెల్యే పీఏను కోరాడు. దీంతో అనుమానం […]

  • Venkata Narayana
  • Publish Date - 8:33 am, Thu, 8 October 20
అర్థరాత్రి చిత్తూరులో పిచ్చకామెడీ.!

చిత్తూరులో అర్థరాత్రి ఫోన్ కలకలం. ఏసీబీ డీఎస్పీనంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పీఏకు హరికృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తనని తాను ఏసీబీ డీఎస్పీ హరిగా పరిచయం చేసుకున్నాడు. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అందించాడు. తాము దాడిచేస్తూ ఉన్నఫలంగా వచ్చి చిత్తూరులో ఒక లాడ్జ్ లో ఉన్నామని.. తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు డబ్బులు పంపాలని హరికృష్ణ సదరు ఎమ్మెల్యే పీఏను కోరాడు.

దీంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన చిత్తూరు పోలీసులు అర్ధరాత్రి లాడ్జ్ లో ఉన్న నకిలీ ఏసీబీ అధికారి హరికృష్ణని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులకు హరికృష్ణ గతంలో ఇలాగే ఫోన్ చేసి డబ్బు గుంజినట్టు తెలుస్తోంది.