
Modi Govt Distributing Free Laptops: కరోనా వైరస్ అన్నింటినీ మార్చేసింది. ముఖ్యంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. దేశవ్యాప్తంగా మార్చి నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ తరుణంలోనే విద్యార్థుల భవిష్యత్తు ప్రశార్ధకరంగా మారకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. స్టూడెంట్స్ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా టీచర్లతో ఇంట్రాక్ట్ అయి.. డౌట్స్‌ను నివృత్తి చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ మెసేజ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
‘నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది. ఉచిత ల్యాప్‌టాప్‌లు పొందేందుకు స్టూడెంట్స్ ‘http://bit.ly/Register-For-Free-Laptop’ లింక్ ద్వారా నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి ” అని ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది.
స్టూడెంట్స్‌కు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నామంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అవాస్తవమని.. ఎవరో మార్ఫింగ్ చేసి ఆ మెసేజ్‌ను క్రియేట్ చేశారని.. కేంద్రం అలాంటి పధకాన్ని ఏమి అమలు చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చింది.
Claim: A text message with a website link is circulating with a claim that the Government of India is offering free laptops for all students. #PIBFactCheck: The circulated link is #Fake. Government is not running any such scheme. pic.twitter.com/VwDyFwcaf4
— PIB Fact Check (@PIBFactCheck) December 15, 2020