బగ్ పట్టు.. గిఫ్ట్ కొట్టు.. ఎఫ్‌బీ భారీ క్యాష్ ప్రైజ్!

ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపొయింది. ప్రొద్దున్న లేస్తే చాలు.. యువత ఫోన్లకు అతుక్కుపోయి.. తమ డైలీ రొటీన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అనేసరికి ప్రైవసీ తక్కువగా ఉంటుంది. హ్యాకర్ల నుంచి తమ డేటాను కాపాడుకోవడానికి ఎన్నో రకాల సంస్థలు వ్యహాత్మక చర్యలు చేపట్టినా ఎక్కడో ఒక చోట లోపాలనేవి బయటపడుతుంటాయి. ఇక వాటి ద్వారా హ్యాకర్లు హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. ఎప్పుడైనా ఓ కంపెనీ కొత్త యాప్‌ను లాంచ్ చేసేటప్పుడు దాన్ని పూర్తిగా […]

బగ్ పట్టు.. గిఫ్ట్ కొట్టు.. ఎఫ్‌బీ భారీ క్యాష్ ప్రైజ్!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 19, 2019 | 6:12 PM

ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపొయింది. ప్రొద్దున్న లేస్తే చాలు.. యువత ఫోన్లకు అతుక్కుపోయి.. తమ డైలీ రొటీన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అనేసరికి ప్రైవసీ తక్కువగా ఉంటుంది. హ్యాకర్ల నుంచి తమ డేటాను కాపాడుకోవడానికి ఎన్నో రకాల సంస్థలు వ్యహాత్మక చర్యలు చేపట్టినా ఎక్కడో ఒక చోట లోపాలనేవి బయటపడుతుంటాయి. ఇక వాటి ద్వారా హ్యాకర్లు హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. ఎప్పుడైనా ఓ కంపెనీ కొత్త యాప్‌ను లాంచ్ చేసేటప్పుడు దాన్ని పూర్తిగా టెస్టింగ్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. కానీ కొన్నిసార్లు వారికి తెలియకుండానే బగ్స్ రహస్యంగా తిష్టవేసి ఉంటాయి.

ఇలాంటివి కనిపెట్టడం కోసం కంపెనీలు హ్యాకర్లకు సవాల్ విసురుతుంటాయి. తమ యాప్స్‌లో బగ్స్, భద్రతాపరమైన లోపాలను కనిపెడితే భారీ మొత్తంలో నజరానా లభిస్తుందని ప్రకటనలు ఇస్తారు. సరిగ్గా ఇలాగే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ హ్యాకర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘బగ్ బౌంటీ ప్రొగ్రామ్’ పేరుతో ఈ స్పెషల్ కాంటెస్టును ప్రకటించింది.

థర్డ్ పార్టీ యాప్స్‌లో భద్రతాపరమైన లోపాలను గుర్తించాలని బౌంటీ పోటీదారులందరికి కండిషన్ పెట్టిన ఎఫ్‌బీ.. రియల్ టైంలోనే యాప్స్ టెస్టింగ్ చేసి అందులోని లోపాలను గుర్తించాలంటూ సవాల్ విసిరింది. ఇలా బగ్స్ కనిపెట్టిన వారికి రూ.35 లక్షలను క్యాష్ ప్రైజ్ కూడా పొందవచ్చని అంటోంది. ఇదే కాకుండా స్థానిక యాప్స్‌లోని సెక్యూరిటీ థ్రెట్స్‌ను గుర్తించినవారికి వెయ్యి డాలర్ల నుంచి 15వేల డాలర్ల వరకు బోనస్ ఇవ్వనున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం యాప్ టెస్టింగ్‌లో మీరు సమర్థులు అయితే.. తక్షణమే ఈ కంటెస్ట్‌ జాయిన్ అవ్వండి.