FaceBook: మాస్‌ లాగౌట్‌లపై స్పందించిన ఫేస్‌బుక్‌… అకౌంట్లు వాటంతంటే అవే ఎందుకు లాగౌట్‌ అయ్యాయంటే..

|

Jan 24, 2021 | 6:54 PM

FaceBook Clarify On Mass LogOut: ఫేస్‌బుక్‌ అకౌంట్లు తమ ప్రమేయం లేకుండానే లాగౌట్‌ అయ్యాయని శుక్రవారం చాలా మంది యూజర్లు నెట్టింట్లో స్పందించారు. తాము లాగౌట్‌ చేయకపోయినా ఫేస్‌బుక్‌ నుంచి తాము ఆటోమేటిగ్గా లాగౌట్‌ అయినట్లు..

FaceBook: మాస్‌ లాగౌట్‌లపై స్పందించిన ఫేస్‌బుక్‌... అకౌంట్లు వాటంతంటే అవే ఎందుకు లాగౌట్‌ అయ్యాయంటే..
Follow us on

FaceBook Clarify On Mass LogOut: ఫేస్‌బుక్‌ అకౌంట్లు తమ ప్రమేయం లేకుండానే లాగౌట్‌ అయ్యాయని శుక్రవారం చాలా మంది యూజర్లు నెట్టింట్లో స్పందించారు. తాము లాగౌట్‌ చేయకపోయినా ఫేస్‌బుక్‌ నుంచి తాము ఆటోమేటిగ్గా లాగౌట్‌ అయినట్లు కొందరు యూజర్లు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అయితే ఈ విషయమై సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ స్పందించింది. కాన్ఫిగ్రేషన్‌లో చేసిన మార్పుల వల్లే ఇలా జరిగిందని ఫేస్‌బుక్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సమస్యను శనివారం పరిష్కరించినట్లు తెలిపింది. ఈ లాగౌట్‌ సమస్యను ఐఫోన్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ ఉపయోగిస్తున్నవారు ఎక్కువగా ఎదుర్కొన్నారు. లాగౌట్‌ అయిన తర్వాత మళ్లీ లాగిన్‌ అయినా.. ఈ సమస్య వల్ల అథెంటికేషన్‌ కోడ్స్‌ వారి మొబైళ్లకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ డేటా ప్రైవసీ విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Also Read: జీమెయిల్ అకౌంట్‏తో మీ పర్సనల్ డేటా గూగుల్‏‏ తీసుకుంటుందని సందేహామా ? అయితే ఈ ట్రిక్స్ పాటిస్తే మీరు సేఫ్..