భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వరద బాధితులకు.. ఈయూ ఆర్థిక సహాయం!

| Edited By:

Aug 11, 2020 | 5:10 PM

వినాశకరమైన వరదలు దక్షిణ ఆసియా అంతటా మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయి. వరదలతో ప్రభావితమైన దక్షిణ ఆసియా దేశాల బాధితులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మానవతా సహాయం ప్రకటించింది.

భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వరద బాధితులకు.. ఈయూ ఆర్థిక సహాయం!
Follow us on

వినాశకరమైన వరదలు దక్షిణ ఆసియా అంతటా మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయి. వరదలతో ప్రభావితమైన దక్షిణ ఆసియా దేశాల బాధితులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మానవతా సహాయం ప్రకటించింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన వరద బాధితుల కోసం 1.65 మిలియన్ యూరోలు (రూ.14.52 కోట్లు) నిధులు అందజేయనున్నట్లు ఈయూ మంగళవారం తెలిపింది.

అంఫాన్ తుఫాను భారతదేశం, బంగ్లాదేశ్ లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. అంఫాన్ తుఫాన్ వల్ల ప్రభావితమైన భారత్, బంగ్లాదేశ్‌లోని బాధిత కుటుంబాలకు ఈ ఏడాది ప్రకటించిన 1.8 మిలియన్ యూరోల (రూ.15.85 కోట్లు) సహాయానికి ఇది అదనమని ఈయూ పేర్కొంది. దీంతో ఈ ప్రాంతంలోని వరద బాధితులను ఆదుకునేందుకు మొత్తంగా 3.45 మిలియన్ యూరోల (రూ.30.37 కోట్ల) నిధులు సమకూర్చినట్లు వెల్లడించింది.

[svt-event date=”11/08/2020,5:05PM” class=”svt-cd-green” ]

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు