EPFO New Enrolments: దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిన ఉద్యోగావకాశాలు.. కేవలం డిసెంబరులో కొత్తగా 8.04లక్షల ఉద్యోగాలు
దేశ వ్యాప్తంగా మళ్లీ మంచి రోజు మొదలయ్యాయి. ఉద్యోగుల భర్తీ రోజు రోజుకు పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య ఘననీయంగా పెరిగిందని..
EPFO New Enrolments: దేశ వ్యాప్తంగా మళ్లీ మంచి రోజు మొదలయ్యాయి. ఉద్యోగుల భర్తీ రోజు రోజుకు పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య ఘననీయంగా పెరిగిందని ఈపీఎఫ్(EPF) లెక్కలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తం చెందుతున్న సమయంలో అన్ని వ్యవస్థలు నిలిచిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా గాడీన పడ్డాయి.
డిసెంబరులో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరారు. వీరిలో 8.04 లక్షల మంది కొత్తవారు కాగా.. 4.5 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు. 2019, డిసెంబరుతో పోలిస్తే సంఘటిత రంగంలో 24 శాతం వృద్ధి నమోదైంది. ఇక నవంబరుతో పోలిస్తే 44 శాతం చేరికలు పెరిగాయి.
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి డిసెంబరు 2020 వరకు 53.70 లక్షల మంది నికర చందాదారులు ఈపీఎఫ్‌ఓలో చేరారు. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం చేరికల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.
వయస్సుల వారీ విశ్లేషణ ప్రకారం.. డిసెంబరు 2020లో 22-25 మధ్య వయస్సు గల కొత్త చందాదారుల సంఖ్య నికరంగా 3.36 లక్షలుగా, 18-21 వయస్సు కేటగిరీలో 2.81 లక్షలుగా నమోదైంది. మొత్తం కొత్త చందాదారుల్లో 18-25 వయస్సు గల వారే 49.19 శాతం ఉండడం గమనార్హం. ఈ వర్గాన్ని కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న వారిగా పరిగణించవచ్చు.
ఈపీఎఫ్‌ఓ లెక్కల ప్రకారం.. ఉపాధి కల్పనలో మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందువరసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి డిసెంబరులో కొత్తగా 29.12 లక్షల మంది నికర చందాదారులు చేరారు. పరిశ్రమల వారీగా చూస్తే సేవా నిపుణులకు అత్యధికంగా ఉపాధి పొందారు. ఇందులో ప్రధానంగా హ్యూమన్ రిసోర్సెస్, చిన్న కాంట్రాక్టర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ రంగం నుంచి మొత్తం 26.94 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు.
ఇవి కూడా చదవండి..
Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..