సాయిబాబా జన్మస్థలం పాథ్రీనే.. దానికి ఆధారాలు ఉన్నాయి!

|

Jan 20, 2020 | 7:45 AM

సాయిబాబా జన్మస్థలంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాబా జన్మస్థలం పాథ్రీనేనని చెప్పడానికి తమ దగ్గర 29 సాక్ష్యాలు ఉన్నాయన్నారు. 1950వ సంవత్సరం నుంచి బాబా పాథ్రీలోనే ఉన్నారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా 1988లో బాబా నివసించిన ప్రదేశంలో సాయి జన్మస్థాన్ మందిర్‌ను స్థానికులు నిర్మించారని చెప్పుకొచ్చారు. ఇకపోతే పాథ్రీ డిమాండ్ ఇప్పటిది కాదని.. రామ్‌నాధ్ కోవింద్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడే పాథ్రీ […]

సాయిబాబా జన్మస్థలం పాథ్రీనే.. దానికి ఆధారాలు ఉన్నాయి!
Follow us on

సాయిబాబా జన్మస్థలంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాబా జన్మస్థలం పాథ్రీనేనని చెప్పడానికి తమ దగ్గర 29 సాక్ష్యాలు ఉన్నాయన్నారు. 1950వ సంవత్సరం నుంచి బాబా పాథ్రీలోనే ఉన్నారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా 1988లో బాబా నివసించిన ప్రదేశంలో సాయి జన్మస్థాన్ మందిర్‌ను స్థానికులు నిర్మించారని చెప్పుకొచ్చారు. ఇకపోతే పాథ్రీ డిమాండ్ ఇప్పటిది కాదని.. రామ్‌నాధ్ కోవింద్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడే పాథ్రీ అభివృద్ధి కోసం అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రూ.100 కోట్లు అడిగారని స్పష్టం చేశారు. కానీ ఆయన స్పందించలేదని చెప్పారు.

ఇక ఈ రహస్యాన్ని షిర్డీవాసులు దాచిపెట్టాలని చూస్తున్నారని.. షిర్డీతో పాటుగా పాథ్రీ అభివృద్ధి చెందాలని వారు కోరుకోవట్లేదని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి ఇప్పటికీ కూడా భక్తులు పాథ్రీలోని సాయిబాబా మందిరాన్ని సందర్శిస్తుంటారు. అయితే వారికి ఆలయం వరకు రావడానికి సరైన మార్గం లేదు.

నాడు రామ్‌నాధ్ కోవింద్ గవర్నర్‌‌గా ఉన్న సమయంలో ఒకసారి ఈ మందిరాన్ని సందర్శించారు. ఇక అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ను పాథ్రీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పిన ఆయన.. కోవింద్ రాష్ట్రపతి అయిన తర్వాత కూడా రాజ్‌భవన్‌లో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు దుర్రాని గుర్తుచేశారు. పాథ్రీ ‘జన్మభూమి’.. షిర్డీ ‘కర్మభూమి’ అన్న నినాదానికి కూడా ఆయన మద్దతును తెలిపారు.

ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ వివాదాన్ని షిర్డీవాసులు దాచిపెడుతూ వస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ నుంచి వచ్చేరన్న విషయాలను బాబా రహస్యంగా ఉంచారని వారు చెబుతూ వచ్చారు. షిర్డీ ‘కర్మభూమి’ మాత్రమే. ‘కర్మభూమి’ మాదిరిగానే ‘జన్మభూమి’ అభివృద్ధి చెందితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రెండు ప్రదేశాలకు తగిన ప్రాముఖ్యత ఉంటుందని.. భక్తులు షిర్డీ, పాథ్రీ రెండింటిని సందర్శించవచ్చునని ఆయన అన్నారు.

కాగా, సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని తాజాగా సీఎం ఉద్దవ్ థాక్రే  ప్రకటించడంతో వివాదం రాజుకుంది. దీనితో షిర్డీవాసులు ఇవాళ్టి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఆలయంలో మాత్రం యధావిధిగా పూజలు, కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే రేపు సీఎం షిర్డీలోని స్థానికులు, సంస్థాన్ ట్రస్ట్‌తో చర్చలు జరపనున్నట్లు మహారాష్ట్ర సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ బంద్‌కు బీజేపీ మద్దతు తెలిపింది.