Telangana: మేడ్చల్ జిల్లా(Medchal district) కండ్లకోయ(Kandlakoya)లో ప్రైవేటు కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థిని వర్షిణి మిస్సింగ్ ఇష్యూను పోలీసులు తేల్చేశారు. ముంబైలో విద్యార్థిని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర పోలీసులతో(Maharashtra Police) మాట్లాడిన తెలంగాణ పోలీసులు… విద్యార్థి క్షేమంగా ఉన్నట్టు తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వర్షిణి అనే విద్యార్థిని కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. కాలేజ్‌కి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. మిడ్ ఎగ్జామ్ కోసం ఆమెను సమీప బంధువు మోహన్‌రెడ్డి కాలేజ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఐడీ కార్డు, మొబైల్ ఇంట్లో మరిచిపోయానని చెప్పి ఆమె క్యాంపస్ నుంచి తిరిగి బయటకు వచ్చింది. అటు తర్వాత సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ముంబైలో ఓపెన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. వెంటనే ఆమె ఉన్న టవర్ లోకేషన్ ఆధారంగా.. ముంబై స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు. వారి సహకారంతో వర్షిణిని గుర్తించారు. ప్రస్తుతం విద్యార్థిని రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే విద్యార్థిని పేరెంట్స్‌తో కలిసి ముంబై వెళ్లిన మేడ్చల్ పోలీసులు ఆమె తీసుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. కాగా డిప్రెషన్‌కు గురికావడంతోనే వర్షిణి ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి