ఎమిరేట్స్ విమానంలో శాటిలైట్ తరలింపు.. దక్షిణ అమెరికా నుంచి చెన్నై చేరిన అమెజోనియా-1 ఉపగ్రహం

|

Dec 31, 2020 | 5:23 AM

బ్రెజిల్‌లో పూర్తిగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఉపగ్రహం అమెజోనియా -1 భారత్ చేరుకుంది.

ఎమిరేట్స్ విమానంలో శాటిలైట్ తరలింపు.. దక్షిణ అమెరికా నుంచి చెన్నై చేరిన అమెజోనియా-1 ఉపగ్రహం
Follow us on

లాటిన్ అమెరికన్ దేశ అత్యున్నత అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేత బ్రెజిల్‌లో పూర్తిగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఉపగ్రహం అమెజోనియా -1 భారత్ చేరుకుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కార్గో రవాణా విభాగం ఎమిరేట్స్ స్కై కార్గో, అమెజోనియా -1 ను బ్రెజిల్‌లోని సావో జోస్ డోస్ కాంపోస్ నుండి చెన్నైకి చేరవేసింది. ఎమిరేట్స్ స్కై కార్గో దక్షిణ అమెరికా నుండి అంతరిక్ష ఉపగ్రహాన్ని రవాణా చేయడం ఇదే మొదటిసారి. అమెజోనియా -1 శాటిలైట్‌ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించనుంది.

అమెజోనియా-1 శాటిలైట్‌ను బ్రెజిల్‌లోని శావ్‌జోసె దస్‌ కంపోస్‌ విమానాశ్రయం నుంచి చెన్నైకు బుధవారం విజయవంతంగా చేర్చినట్లు ఎమిరేట్స్‌ కార్గో విభాగమైన ‘స్కై కార్గో’ వెల్లడించింది. ఈ శాటిలైట్‌ను 2021 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. అంతరిక్షానికి పంపే శాటిలైట్లు, ఇతర కీలక వ్యవస్థలను రవాణా చేయడంలో ఎమిరేట్స్‌ స్కై కార్గోకు విశేష అనుభవం ఉందని ఆ సంస్థ తెలిపింది. ఎమిరేట్‌ ఇంజినీర్లు రూపొందించిన ఖలిఫసత్‌ శాటిలైట్‌ను దుబాయ్‌ నుంచి సియోల్‌కు 2018లో తొలిసారిగా రవాణా చేయడం ద్వారా స్కైకార్గో ఈ సేవలకు శ్రీకారం చుట్టింది.

8 సంవత్సరాల పరిశోధనలతో అమెజోనియా-1 శాటిలైట్‌ను పూర్తిగా బ్రెజిల్‌లోనే అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్‌ రెయిర్‌ ఫారెస్ట్‌ పర్యావరణ వ్యవస్థ ఎలా ఉందో పరిశీలించడం ఈ శాటిలైట్‌ ప్రయోగ లక్ష్యం. ఇంత కీలకమైన శాటిలైట్‌ను సురక్షితంగా రవాణా చేసేందుకు సంస్థ అతిపెద్ద బోయింగ్‌ 777 ఫ్రైటర్‌ను ఎమిరేట్స్‌ వినియోగించింది. శాటిలైట్‌ను పలు భాగాలుగా విడదీసి, జాగ్రత్తగా ప్యాకింగ్‌ చేసి ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా అతిపెద్ద కంటైనర్లలో ఉంచి, తీసుకు వచ్చినట్లు స్కైకార్గో తెలిపింది. ఈ మొత్తం బరువు 22 టన్నులు కాగా, తొలుత బ్రెజిల్‌లోని శావ్‌జోసె దస్‌ కంపోస్‌ నుంచి దుబాయ్‌కి, అక్కడ నుంచి చెన్నైకు చేరవేసినట్లు పేర్కొంది. ఈ శాటిలైట్ వాణాకు ముందుగా సిమ్యులేషన్‌ పద్ధతిలో రెండుసార్లు పరీక్షించుకున్నట్లు వివరించింది.

మిరేట్స్ విమానంలో శాటిలైట్ తరలింపు