రెండు రోజులవుతున్నా.. ఏపీలో ఆగని అల్లర్లు..

| Edited By:

Apr 13, 2019 | 8:55 AM

ఏపీలో ఎన్నికలు అయ్యాయో లేదో.. అలా తన్నులాట మొదలయింది. ఫ్యాక్షన్ గ్రామస్తులు మొదలు కొని మామాలు గ్రామాల్లో సైతం కర్రలు గాల్లోకి లేస్తున్నాయి. తలలు చిప్పల్లా పగులుతున్నాయి. జనం ఆస్పత్రి పాలవుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పలు గ్రామాల్లో ఓటు కక్షలు భగ్గుమన్నాయి. ఈ జిల్లాల్లోని పలు గ్రామాల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ స్థానికుల్లో కనిపిస్తోంది. ఎలక్షన్స్ ముగిసి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఉద్రిక్త వాతావరణం […]

రెండు రోజులవుతున్నా.. ఏపీలో ఆగని అల్లర్లు..
Follow us on

ఏపీలో ఎన్నికలు అయ్యాయో లేదో.. అలా తన్నులాట మొదలయింది. ఫ్యాక్షన్ గ్రామస్తులు మొదలు కొని మామాలు గ్రామాల్లో సైతం కర్రలు గాల్లోకి లేస్తున్నాయి. తలలు చిప్పల్లా పగులుతున్నాయి. జనం ఆస్పత్రి పాలవుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పలు గ్రామాల్లో ఓటు కక్షలు భగ్గుమన్నాయి. ఈ జిల్లాల్లోని పలు గ్రామాల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ స్థానికుల్లో కనిపిస్తోంది. ఎలక్షన్స్ ముగిసి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా రాయలసీమ పల్లెల్లో క్షణక్షణం.. భయం భయంగా మారింది. ఎన్నికల టైమ్‌లో ప్రధాన పార్టీల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది.

పోలింగ్ రోజు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరునొకరు రక్తం కారేలా కొట్టుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా ఘటనలు జరిగాయి. ఈ పరస్పర దాడుల్లో ఇద్దరు చనిపోయారు కూడా.. అయితే.. మళ్లీ అవే ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. పోలింగ్ ముగిసి రెండు రోజులైనా.. ఇంకా గొడవలు  సద్దుమణగలేదు. కాగా.. ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ నాటి ఘటనలు మరోసారి పునరావృతమయ్యేలా కనిపిస్తుండడంతో అదనపు బలగాలతో పహారా కాస్తున్నారు పోలీసులు.