తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటారు…అంతా ఆయన పేరే చెప్పారు..! కోర్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్ ప్రశ్నలు

|

Dec 10, 2020 | 5:52 AM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఇంకా ముగియలేదు. గాంధీ భవన్‌లో దీనికి సంబంధించిన ప్రక్రియలో తొలి భాగం ముగిసింది. కాంగ్రెస్‌ కోర్ కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం టాగూర్‌ భేటీ అయ్యారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటారు...అంతా ఆయన పేరే చెప్పారు..! కోర్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్ ప్రశ్నలు
Follow us on

Election Process of Telangana PCC  : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఇంకా ముగియలేదు. గాంధీ భవన్‌లో దీనికి సంబంధించిన ప్రక్రియలో తొలి భాగం ముగిసింది. కాంగ్రెస్‌ కోర్ కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం టాగూర్‌ భేటీ అయ్యారు. ముందుగా.. కోర్‌ కమిటీ నేతలతో సమిష్టిగా భేటీ అయిన ఠాగూర్‌.. తర్వాత విడివిడిగా సమావేశం అయ్యారు.

ఒక్కొక్కరికి పది పది నిమిషాలు కేటాయించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా పీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్నారా..? ఎవరికైనా మద్దతునిస్తున్నారా? అనేది ఆయన అడిగినట్లు సమాచారం. అప్పటికే నలుగురు ఐదుగురి పేర్లు జోరుగా వినిపించాయి. వీరిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరే ఎక్కువగా వినిపించింది.

తర్వాత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మధుయాష్కి, శ్రీధర్‌ బాబు కూడా పీసీసీ కోసం పోటీపడుతున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. మరోవైపు మానిక్కం ఠాకూర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సేవలను కొనియాడారు. ఆయన పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర కాంగ్రెస్‌ గెలుపుకోసం ఎంతో కృషి చేశారన్నారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి కోలుకుని మరో మంచి నాయకుడిని ఎన్నుకుంటామన్నారు. మానిక్కం ఠాకూర్‌ కోర్‌ కమిటీ సభ్యులతో ఏకాంత సమావేశం బుధవారం అర్ధరాత్రి వరకు జరిగింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ మంత్రులతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. నల్గొండ జిల్లా ముఖ్యనేతకే పీసీసీ పదవి వరిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రంలోగా అధిష్టానంతో సంప్రదింపులు జరిపి పీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది.