‘ మా మిసైల్ దాడుల్లో 80 మంది అమెరికన్ టెర్రరిస్టుల మృతి’.. ఇరాన్

| Edited By: Pardhasaradhi Peri

Jan 08, 2020 | 4:27 PM

ఇరాక్ లోని అమెరికన్ సైనిక స్థావరాలపై తాము 15 మిసైళ్ళతో జరిపిన దాడుల్లో కనీసం 80 మంది ‘ అమెరికన్ టెర్రరిస్టులు ‘ మరణించారని ఇరాన్ ప్రకటించింది. మా క్షిపణులన్నీ నిరాఘాటంగా టార్గెట్లను తాకాయని సీనియర్ రెవల్యూషనరీ గార్డ్స్ ను ఉటంకిస్తూ.. ఇరాన్ టీవీ పేర్కొంది. అమెరికా ఒకవేళ ప్రతీకార చర్యకు దిగిన పక్షంలో మేం మరో 100 టార్గెట్లను లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆ గార్డ్స్ తెలిపారని టీవీ వెల్లడించింది. తమ మిసైల్ ఎటాక్స్ లో […]

 మా మిసైల్ దాడుల్లో 80 మంది అమెరికన్ టెర్రరిస్టుల మృతి.. ఇరాన్
Follow us on

ఇరాక్ లోని అమెరికన్ సైనిక స్థావరాలపై తాము 15 మిసైళ్ళతో జరిపిన దాడుల్లో కనీసం 80 మంది ‘ అమెరికన్ టెర్రరిస్టులు ‘ మరణించారని ఇరాన్ ప్రకటించింది. మా క్షిపణులన్నీ నిరాఘాటంగా టార్గెట్లను తాకాయని సీనియర్ రెవల్యూషనరీ గార్డ్స్ ను ఉటంకిస్తూ.. ఇరాన్ టీవీ పేర్కొంది. అమెరికా ఒకవేళ ప్రతీకార చర్యకు దిగిన పక్షంలో మేం మరో 100 టార్గెట్లను లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆ గార్డ్స్ తెలిపారని టీవీ వెల్లడించింది. తమ మిసైల్ ఎటాక్స్ లో అమెరికన్ హెలికాఫ్టర్లు, సైనిక సాధనాలు, పరికరాలు ధ్వంసమయ్యాయని వారు చెప్పుకున్నారు. అయితే ఈ సమాచారం ఎక్కడినుంచి వచ్చిందన్నదాన్ని   మాత్రం వెల్లడించలేదు. అటు-అమెరికాతో తాము యుధ్ధాన్ని కోరుకోవడంలేదని, గత శుక్రవారం తమ సైనిక జనరల్ ఖాసిం సులేమాన్ యుఎస్ డ్రోన్ దాడుల్లో మృతి చెందినందుకు ప్రతీకారంగానే చేసిన దాడులు ముగిశాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. కెర్మాన్ నగరంలో సులేమాన్ అంత్యక్రియలు ముగుస్తుండగా.. దాదాపు అదే సమయంలో ఈ మిసైల్ దాడులు జరిగాయని వారు గుర్తు చేశారు. కాగా-ఈ క్షిపణి దాడులు జరుగుతుండగా ఇరానియన్లు సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ 51 వ అధికరణం కింద ఆత్మరక్షణార్థం తాము తీసుకున్న చర్యలు ముగిశాయని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ కూడా తెలిపారు. తాము యుధ్ధాన్ని కోరుకోవడంలేదని, అయితే ఎలాంటి ‘ ఆక్రమణనైనా ఎదుర్కొనేందుకు సంసిధ్ధంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.