Big Breaking : బోరబండలో మళ్లీ భారీ శబ్దాలు

|

Oct 03, 2020 | 8:52 AM

హైదరాబాద్ బోరబండలో మళ్లీ భారీ శబ్దాలు కలకలం రేపుతున్నాయి.దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

Big Breaking : బోరబండలో మళ్లీ భారీ శబ్దాలు
Follow us on

హైదరాబాద్ బోరబండలో మళ్లీ భారీ శబ్దాలు కలకలం రేపుతున్నాయి. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లాలంటే జంకుతోన్న బోరబండ వాసులు, రాత్రంతా ఆరుబయటే బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రి రెండు సార్లు భూ ప్రకంపనలు వారిని కలవరపెట్టాయి. మరికాసేపట్లో రానున్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు బోరబండ చేరుకోనున్నారు. సంవత్సరన్న క్రితం కూడా ఇదే విధంగా శబ్దాలతో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.(సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం, వైఎస్ భారతి తండ్రి కన్నుమూత)

రాత్రి సంభవించిన భూ ప్రకంపనలకు సంబంధించి టీవీ9 తో ఎన్జీఆర్ఐ భూకంప అధ్యయన హెచ్.వో.డీ డాక్టర్ శ్రీనగేష్ మాట్లాడారు. బోరబండలో వచ్చిన శబ్దాలు భూకంపమేనన్నారు. బోరబండ సైట్ త్రీలో ప్రకంపనలు రేగాయని.. 1.4 తీవ్రతతో భూ కంపం వచ్చినట్లు ఎన్జీఆర్ఐ గుర్తించిందని తెలిపారు. రాత్రి 8.45 కి ఈ ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు.(గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం)