న్యూ ఇయర్ సెలబ్రేషన్స్… మంటల్లో వానరాల సజీవదహనం

|

Jan 01, 2020 | 6:16 PM

కొత్త సంవత్సర వేడుకలు మూగజీవాలైన వానరాల సజీవ దహనానికి దారి తీశాయి. జర్మనీలోని క్రెఫోర్డ్ జూ లో తమ ఎంక్లోజర్లో సేద దీరిన ఒరాంగుటాన్లు, చింపాంజీలు వాటి పిల్లలతో సహా సజీవదహనమై.. ఆ మంకీ ఎంక్లోజర్ బుగ్గి బూడిదయింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జర్మనీ వాసులు పేల్చిన తారాజువ్వలు, ఇతర టపాసుల నిప్పురవ్వలు ఈ జూ లోని వీటి ఎంక్లోజర్ పై పడడంతో క్షణాల్లో అది మంటలకు ఆహుతయింది. ఈ ఘటనలో ఈ మూగజీవాలన్నీ ప్రాణాలు […]

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...  మంటల్లో వానరాల సజీవదహనం
Follow us on

కొత్త సంవత్సర వేడుకలు మూగజీవాలైన వానరాల సజీవ దహనానికి దారి తీశాయి. జర్మనీలోని క్రెఫోర్డ్ జూ లో తమ ఎంక్లోజర్లో సేద దీరిన ఒరాంగుటాన్లు, చింపాంజీలు వాటి పిల్లలతో సహా సజీవదహనమై.. ఆ మంకీ ఎంక్లోజర్ బుగ్గి బూడిదయింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జర్మనీ వాసులు పేల్చిన తారాజువ్వలు, ఇతర టపాసుల నిప్పురవ్వలు ఈ జూ లోని వీటి ఎంక్లోజర్ పై పడడంతో క్షణాల్లో అది మంటలకు ఆహుతయింది. ఈ ఘటనలో ఈ మూగజీవాలన్నీ ప్రాణాలు కోల్పోయాయి. కనీసం ఒక్క జీవి కూడా తప్పించుకోలేకపోయింది. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.