
Dost Degree Seats: తెలంగాణలో మూడు విడతల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అయితే వివిధ కారణాల వల్ల తాజాగా డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు ఈ నెల 19వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.
ఇప్పటికే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన అభ్యర్ధులు కళాశాలలకు వెళ్లి చేరాలని ఆయన సూచించారు. మరోవైపు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదట, రెండు సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా, పరీక్షలు రాసేందుకు ఈ నెల 25వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Also Read:
జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..