‘ మాటలు రావడంలేదు ‘.. దిశ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

|

Dec 02, 2019 | 4:36 PM

తెలంగాణాలో యువ వైద్యురాలు దిశ హత్యాచార ఘటనను సోమవారం పార్లమెంట్ యావత్తు ఖండించింది. పాలక, విపక్ష పార్టీల సభ్యులంతా ముక్త కంఠంతో ఈ విధమైన నేరాలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మహిళలు, పిల్లలను మృగాళ్ల బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈ విధమైన దారుణ నేరాలను అరికట్టేందుకు సభ్యులు చేసే ఎలాంటి సూచననైనా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని అన్నారు. […]

 మాటలు రావడంలేదు .. దిశ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
Follow us on

తెలంగాణాలో యువ వైద్యురాలు దిశ హత్యాచార ఘటనను సోమవారం పార్లమెంట్ యావత్తు ఖండించింది. పాలక, విపక్ష పార్టీల సభ్యులంతా ముక్త కంఠంతో ఈ విధమైన నేరాలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మహిళలు, పిల్లలను మృగాళ్ల బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈ విధమైన దారుణ నేరాలను అరికట్టేందుకు సభ్యులు చేసే ఎలాంటి సూచననైనా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని అన్నారు. ఇలాంటి ఘటనలు దేశానికే సిగ్గుచేటని, నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ తెలంగాణలో జరిగిన దారుణ నేరంపై మాట్లాడేందుకు నాకు మాటలే దొరకడంలేదు.. స్పీకర్ అనుమతిస్తే సభలో దీనిపై పూర్తి స్థాయి చర్చ జరుగుతుందని, సభ్యులు చేసే ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే కొత్త చట్టాన్ని తేవచ్చునని ఆయన అన్నారు. కఠినాతి కఠినమైన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉందని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
కాగా-దిశ ఘటనపై ఢిల్లీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కదం తొక్కారు. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దిశ కుటుంబానికి న్యాయం జరగాలని రాసి ఉన్న బ్యానర్లను వారు ప్రదర్శించారు.