తీహార్ జైల్ ఎలా ఉంటుందో తెలుసా..? ఖైదీలకు పెట్టే భోజనం ఇదే..!

| Edited By:

Sep 05, 2019 | 9:11 PM

తీహార్ జైలు అంటే.. చాలా భయంకరమైన ప్రాంతమని.. చాలా మందికి అపోహలు ఉన్నాయి. కానీ.. కొన్ని సంస్కరణలకు పురుడు పోసుకున్న స్థానం.. తీహార్ జైలు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు.. తీహార్ ప్రాంతంలో కలదు. అందుకే దీనికి ‘తీహార్ జైలు’ అని పేరొచ్చింది. ఇది ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. తీహార్‌ జైలులో.. దాదాపు 10 వేల మంది ఖైదీలకు సరిపోయే వసతులున్నాయి. అయినా.. అంతకుమించే ఈ జైలులో ఎప్పుడూ ఎక్కువమందికి ఆశ్రయం […]

తీహార్ జైల్ ఎలా ఉంటుందో తెలుసా..? ఖైదీలకు పెట్టే భోజనం ఇదే..!
Follow us on

తీహార్ జైలు అంటే.. చాలా భయంకరమైన ప్రాంతమని.. చాలా మందికి అపోహలు ఉన్నాయి. కానీ.. కొన్ని సంస్కరణలకు పురుడు పోసుకున్న స్థానం.. తీహార్ జైలు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు.. తీహార్ ప్రాంతంలో కలదు. అందుకే దీనికి ‘తీహార్ జైలు’ అని పేరొచ్చింది. ఇది ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో కలదు.

తీహార్‌ జైలులో.. దాదాపు 10 వేల మంది ఖైదీలకు సరిపోయే వసతులున్నాయి. అయినా.. అంతకుమించే ఈ జైలులో ఎప్పుడూ ఎక్కువమందికి ఆశ్రయం పొందుతూంటారు. భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ఈ ప్రాంతం నుంచే సంస్కరణలు మొదలుపెట్టారు. ఎంతో మంది రాజకీయ నేతలకు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు, ఉద్యమ నాయకులకు ఈ జైలు ఆశ్రయ విచ్చింది. అందుకే దీన్ని ‘తీహార్ ఆశ్రమం’ అని కూడా అంటారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో.. అత్యంత కీలకులైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్‌లను ఈ జైలులోనే నిర్భంధించారు. కేంద్ర మాజీ మంత్రి ఎం.కె. కనిమొళిలను 2జీ కేసులో అరెస్ట్ చేసి ఇదే జైలులోనే ఉంచారు.

కాగా.. తీహార్‌ జైలులో ప్రస్తుతం 15 వేల మంది ఖైదీలు ఉంటున్నారు. వారందరికీ ఆహారం పెట్టడం చాలా కష్టతరమైన పని. తీహార్ జైలులో 4 వంటగదులు ఉంటాయి. వేసవి సమయంలో.. ఈ వంటగది చాలా వేడిగా.. ఉంటుంది. ఇందులో వంట చేయడానికి.. సిబ్బంది మరియు ఖైదీలు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.

అలాగే.. ఖైదీలకు ఉదయం 5 గంటలకు అల్పాహారం అంటే టిఫిన్ పెడతారు. అందులో.. రోటీలు, చపాతీలు, పూరీలు, పప్పును పెడతారు. ఇక మధ్యాహ్నాం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ, పెథా పెడతారు. రాత్రికి కూడా ఇదే మెనూ ఉంటుంది. వారానికి రెండు సార్లు ఖీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ మాంసాహారన్ని ఉచితంగా పెట్టరు. వారు వారంతంలో కష్టపడిన డబ్బులతో.. స్వయంగా క్యాంటీన్‌లో కొనుక్కోని తినవలసి ఉంటుంది.