డిజిటల్ రంగంలో సంచలనం సృష్టించిన‌ ‘డర్టీ హరి’.. రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్న రొమాంటిక్ సస్పెన్స్ చిత్రం.

సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు కలెక్షన్ల ఆధారంగా సినిమా విజయాలను అంచనా వేసేవారు. ఇప్పుడేమో ఆన్‌లైన్‌లో సినిమాకు ఎన్ని వ్యూలు వచ్చాయన్న ఆధారంగా సినిమా విజయాన్ని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైన ‘డర్టీ హరి’ చిత్రం రికార్డు సృష్టించింది.

డిజిటల్ రంగంలో సంచలనం సృష్టించిన‌ ‘డర్టీ హరి’.. రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్న రొమాంటిక్ సస్పెన్స్ చిత్రం.

Updated on: Dec 20, 2020 | 8:32 PM

Dirty hari record views: థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఇక నిర్మాతలు కూడా తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడానికి ముందుకొస్తున్నారు. దీంతో కొత్తగా చాలా ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు కలెక్షన్ల ఆధారంగా సినిమా విజయాలను అంచనా వేసేవారు. ఇప్పుడేమో ఆన్‌లైన్‌లో సినిమాకు ఎన్ని వ్యూలు వచ్చాయన్న ఆధారంగా సినిమా విజయాన్ని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైన ‘డర్టీ హరి’ చిత్రం రికార్డు సృష్టించింది.
ఫ్రైడే మూవీస్ ఏటీటీలో డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ చిత్రం ఏకంగా 91,818 వ్యూస్ దక్కించుకుంది. ఇక ఈ చిత్రాన్ని అప్‌లోడ్ చేసినప్పుడు ఒకేసారి 25 వేల మంది వ్యూవర్స్ రావడంతో ఏటిటి యాప్‌కు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించగా.. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. చిత్ర యూనిట్ మొదటి నుంచి హాట్ హాట్ పోస్టర్లను బాగా ప్రచారం చేయడంతో ఈ సినిమా ఏంటనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొనడం కూడా దీని విజయానికి ఓ కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.