యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాహుబలి’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా రికార్డులూ సృష్టించింది.
‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్-రాజమౌళి ఎవరి ప్రాజెక్ట్‌లతో వాళ్లు బిజీగా మారిపోయారు. అయితే, వీరిద్దరి కాంబినేషన్ మరో సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో కలిసి మరోసారి పనిచేయడంపై రాజమౌళి స్పందించారు.
బాహుబలి కోసం ఐదేళ్లు కలిసి పనిచేయడం వల్ల తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అన్నారు. అయితే, తమ ఇద్దరిలో ఆసక్తి రేకెత్తించే కథ సిద్ధమైతే.. తప్పకుండా మరోసారి కలిసి పని చేస్తామని అన్నారు.