నువ్వు నన్ను గర్వపడేలా చేశావంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ‘ఫైటర్’ వీడియో షేర్ చేసిన పూరీ జగన్నాథ్ ..

|

Dec 28, 2020 | 7:20 AM

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా హిట్‏తో రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

నువ్వు నన్ను గర్వపడేలా చేశావంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఫైటర్ వీడియో షేర్ చేసిన పూరీ జగన్నాథ్ ..
Follow us on

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా హిట్‏తో రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏తో కలిసి ఫైటర్ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ సినిమా లోకేషన్‏కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‏గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫైటర్‏కు సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ తెరకెక్కిస్తున్న చిత్రం ఫైటర్‏లో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. ఇందులోని పాత్ర కోసం విజయ్ దేవరకొండ జిమ్‏లో కసరత్తులు కూడా చేస్తున్నాడు. “దటీజ్ మై హీరో, దటీజ్ మై ఫైటర్, నువ్వు నన్ను గర్వపడేలా చేశావు. లవ్ యూ విజయ్” అంటూ తన ట్విట్టర్‏లో విజయ్ జిమ్ చేస్తోన్న వీడియోను షేర్ చేసాడు పూరీ. దీంతో విజయ్- పూరీ జగన్నాథ్ మళ్ళీ ఫైటర్ షూటింగ్‏లో బిజీ అయినట్లు తెలుస్తోంది. మరీ విజయ్ కెరీర్‏లో ఫైటర్ మళ్ళీ విజయాన్ని అందించబోతుందా అనేది చూడాలి ఇక.