ఏంటి పైన హెడ్డింగ్ చదివి షాక్ అయ్యారా? అవును యాంకర్ అనసూయపై నాగబాబు రివేంజ్ తీసుకున్నారట. నాగబాబు వల్లనే అనసూయకి బంగారం లాంటి అవకాశం చేజారిపోయిందట. ఏకంగా మెగాస్టార్‌తో నటించాల్సిన అనసూయకి ఓ మంచి అవకాశం అందినట్టే అంది.. మిస్సయిందట. నిజానికి.. అనసూయ అందాలు జబర్దస్త్‌కి వ్యూస్‌ని పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే.. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో కూడా ఆమెకు సినిమా అవకాశాలు పెరిగాయడనంలో సందేహం అనవసరం. జబర్దస్త్ షో చాలా మందికి లైఫ్‌ని ఇచ్చింది. అసలు నాగబాబు ఇంత క్యాజువల్‌గా ఉంటారా? అని తెలిసింది కూడా జబర్దస్త్ షోతోనే.
ఇప్పడు అసలు విషయం ఏంటంటే.. కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 158 సినిమా వస్తోంది. అందులో యాంకర్ అనసూయకి ఓ ముఖ్యమైన రోల్ ఇచ్చారని గతంలో పలు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం వెటరన్ ఆర్టిస్ట్ చేతికి వెళ్లిపోయిందట. ఇందుకు కారణంగా.. నాగబాబునే అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. నాగబాబు కొన్ని కారణాలతో జబర్దస్త్ షో నుంచి అదిరింది షోకు వెళ్లిపోయారు. అప్పుడు అనసూయని తనతో రమ్మని ఆహ్వానించారట. అందుకు అనసూయ నో చెప్పిందట దీంతో.. ఆయన ఇన్సెల్ట్‌గా ఫీల్ అయి ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి ఆమెకు ఆ క్యారెక్టర్ రాకుండా చేశారని.. ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ గుప్పుమంటోంది.