గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏడాది వార్షికోత్సవం పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయవాడ బీఆర్టీస్ రోడ్డులో ‘థ్యాంక్యు సీఎం’ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ 23 అడుగుల భారీ చిత్రపటానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్రేన్ ద్వారా పాలాభిషేకం చేశారు. సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు అడుగులు పడ్డాయని అంజాద్ బాషా పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పేదల ముంగిటికే సంక్షే పథకాలు వస్తున్నాయని వెల్లడించారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగానే వాలంటీర్లు సైనికుల్లా పని చేయాలని సూచించారు. జగన్ స్ఫూర్తితో ఏపీ గ్రామ స్వరాజ్యం వైపు పయనిస్తోందన్నారు. గాంధీజీ కలలు సాకారం చేస్తున్న ఏపీ వైపే అన్నిరాష్ట్రాలు చూస్తున్నాయని ఆయన వివరించారు.
Also Read :
సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం, వైఎస్ భారతి తండ్రి కన్నుమూత