ఢిల్లీలో మరో దారుణం.. పోలీసులమంటూ బెదిరించి పార్క్‌లో మైనర్‌పై సామూహికంగా అఘాయిత్యం..!
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. కల్కాజీ ప్రాంతంలోని ఆస్థా కుంజ్ పార్కులో ముగ్గురు వ్యక్తులు పోలీసులమంటూ నటించి 17 ఏళ్ల బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 21, సోమవారం రాత్రి జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మైనర్ బాలిక తన 17 ఏళ్ల స్నేహితుడితో కలిసి ముందుగా కల్కాజీ ఆలయానికి వెళ్లింది. అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఆస్థా కుంజ్ పార్కులోకి వెళ్లారు. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులమని పరిచయం చేసుకుని, ఇద్దరూ మైనర్లని చెబుతూ కేసు పెడతామని బెదిరించినట్లు బాలిక వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలికను స్నేహితుడి నుంచి వేరు చేసి పార్కులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై రాత్రి 8.45 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. POCSO, BNSలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్కు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టగా.. అమర్ కాలనీ ప్రాంతంలో ఆసిఫ్‌ను పోలీసులు గుర్తించారు. లొంగిపోవాలని కోరినప్పటికీ అతడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఓ హెడ్ కానిస్టేబుల్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌కు తూటా తగలడంతో, పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆసిఫ్ కుడి కాలికి బుల్లెట్ గాయమైంది. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..