ఢిల్లీలో హాట్‌స్పాట్‌లుగా మారిన మార్కెట్లలో లాక్‌డౌన్ : కేజ్రీవాల్ నిర్ణయం
ఢిల్లీలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వంపై..
ఢిల్లీలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వంపై నాలుగు అక్షింతలు వేసింది.. కరోనా నియంత్రణ కోసం ఏం చేస్తున్నారంటూ నిలదీసింది.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.. కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా మారుతున్న మార్కెట్లను మూసేయాలని నిర్ణయించింది.. అలాగే వివాహాది శుభకార్యాలలో ఎక్కువ మంది పాల్గొనకూడదంటూ గట్టిగా చెబుతోంది.. ఇప్పటి వరకు వేడుకలకు 200 మంది వరకు అనుమతించేవారు.. ఇప్పుడా పరిమితిని 50కి కుదిస్తున్నారు.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి ఆల్‌రెడీ పంపించింది ఢిల్లీ సర్కారు. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నదని మీడియాకు కేజ్రీవాల్ చెప్పారు. హాట్‌స్పాట్‌లుగా మారిన మార్కెట్లలో లాక్‌డౌన్ విధించాలనుకుంటున్నామని చెప్పారు.. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. కరోనా వ్యాపిస్తున్నా కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని, మాస్క్‌లు కూడా పెట్టుకోవడం లేదని కేజ్రీవాల్ అన్నారు.. తమకు కరోనా వైరస్ సోకదన్న మొండి ధైర్యం పనికిరాదని హితవు చెప్పారు.. ‘చేతులెత్తి దండంపెడుతున్నా… దయచేసి మాస్కులు పెట్టుకోండి, భౌతిక దూరం పాటించండి’ అని ప్రజలను కోరారు కేజ్రీవాల్..