ఢిల్లీలో మరోసారి కరోనా కల్లోలం.. మరో 1,000 పడకలు కావాలని కేంద్రాన్ని కోరిన కేజ్రీవాల్ సర్కార్
ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా లేదు. చిన్నా పెద్ద అన్నీ తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా లేదు. చిన్నా పెద్ద అన్నీ తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం అంటూ ప్రపంచ దేశాలు నివారణ చర్యలు చేపట్టినా కొవిడ్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. రికవరీ రేటు ఎలా ఉన్నా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల మాత్రం ఆగడం లేదు.
దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ కొనసాగుతుంది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతూ రికవరీ రేట్ ఎక్కువుగా ఉన్న, ఉత్తరాదిన రాష్ట్రాలలో మాత్రం వ్యాప్తి సెకండ్ వేవ్ తారాస్థాయి కి చేరింది. ముఖ్యంగా హర్యానా , గుజరాత్, రాజస్థాన్, మణిపూర్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ, మరణాల సంఖ్య కూడా అధికమవుతోంది. దీంతో అప్రమత్తమైన అయా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి.
అటు దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతుంది. పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా అదనపు కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరో అదనంగా 1000 పడకల ఐసీయూ బెడ్స్ అవసరమవుతాయని తెలిపింది. కాగా ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతోపాటు కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. హరియాణా, రాజస్థాన్ ప్రజలు డీల్లీకి రాకపోకలు సాగిస్తుండటంతో ఆయా రాష్ట్రాలలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లను ప్రారంభిస్తున్నారు. కరోనా కేసులు నమోదవుతున్నా.. చిన్న చిన్న లోపాలను అధిగమిస్తూ స్కూళ్లను తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ఢిల్లీలో మాత్రం స్కూళ్లను ఇప్పుడప్పుడే తెరిచే ఆలోచన లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు స్కూల్స్‌ను తెరిచే అవకాశం లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. ఢిల్లీ విద్యాశాఖమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా చెప్పడంతో.. దేశ రాజధానిలో ఇక ఇప్పుడప్పుడే స్కూల్స్ తెరుచుకునే అవకాశం లేదని తేలిపోయింది.
స్కూల్స్‌కు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఏ మాత్రం సుముఖంగా లేరని ఆయన కొద్ది రోజుల క్రితమే చెప్పారు. ఇలాంటి సమయంలో స్కూల్స్ తెరవడం క్షేమం కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఢిల్లీలో స్కూల్స్ తెరుచుకోవడం ఉండదని అన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి స్కూల్స్ మూతపడ్డాయి. అయితే సెప్టెంబర్ 21 నుంచి స్కూల్స్‌ను తెరవాలని భావించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది.
మరోవైపు ఢిల్లీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,40,541కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా దేశరాజధానిలో గంటకు ఐదుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. దీనికిముందు సోమవారం కరోనాతో 121 మంది మృతి చెందారు. పండుగల సీజన్‌లో కరోనా నియమాలను చాలామంది ఉల్లంఘించారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. అలాగే పెళ్లిళ్లకు కూడా భారీగా హాజరవుతూ కరోనా ముప్పు పొంచివుందన్న విషయాన్నే మరచిపోయారు. అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలంతా కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.