
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో కొనసాగుతోన్న రైతు ఉద్యమం ఆగడంలేదు సరికదా, రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. కేంద్రం రైతు సంఘాలతో ఇప్పటికే పలు ధపాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీంతో రైతులతో మోదీ సర్కారు చర్చల పరంపర కొనసాగిస్తూ వస్తోంది. మరో వైపు, రైతన్నల నిరసనలు నేటికి 27 వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన రైతాంగం నిన్నటి నుండి నిరాహార దీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీక్షలు నేడుకూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ రోజు, కేంద్రం సింగు సరిహద్దులో రైతులతో సమావేశం జరుపనుంది.
రైతుల నిరాహారదీక్షలు, ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ నుండి ఘజియాబాద్ వెళ్లే రహదారి స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రహదారిని మూసివేసి ఢిల్లీ, ఘజియాబాద్ వెళ్లే వాహనాలను ఆనంద్ విహార్, అప్సర, భోప్రా, డీఎన్డీ మీదుగా.. నిజాముద్దీన్ ఖత్తా, అక్షర్ధామ్, ఘాజిపూర్ చౌక్ నుండి ట్రాఫిక్ మళ్లించామని ప్రయాణీకులు, వాహనదారులు గమనించాలని ఢిల్లీ ఓటర్ రేంజ్ అదనపు ట్రాఫిక్ సీపీ వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం రైతులపట్ల అహంకారం చూపిస్తోందని ఆప్ యువ నేత రాఘవ్ చద్దా అభిప్రాయపడ్డారు. రైతుల డిమాండ్లు సమంజసమైనవన్న ఆయన, ఈ విషయంలో కేంద్రం పట్టుదలవీడాలని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రాఘవ్ డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. టెంట్లలో దీక్షకు కూర్చున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున వస్తోన్న మద్దతుదారులకు వివిధ సంస్థలు టీపానియాలు ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
कृषि कानूनों के खिलाफ टिकरी बॉर्डर पर विरोध प्रदर्शन कर रहे किसान अभी भी डटे हुए हैं। #FarmersProtest pic.twitter.com/larwqByvyf
— ANI_HindiNews (@AHindinews) December 22, 2020
మూడు వ్యవసాయ చట్టాలపై సవరణకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావున రైతులు తమ ఆందోళనను విరమించుకోవాలని భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కోరారు. రైతులు ధర్నాలు, ఆందోళనలు వీడి ప్రభుత్వంతో సహకరించి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ స్లోగన్ కు భారతదేశంలో ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే.
రైతు ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేశ్ తకైత్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఉద్యమాన్ని పొడిగించాలని ప్రభుత్వం కోరుకుంటుందని, అందువల్ల రైతు నాయకులతో మాట్లాడటానికి ఇష్టపడ్డంలేదని ఆరోపించారు. ప్రభుత్వం కోరిన చోటకి రైతు నాయకులు చర్చల కోసం వస్తారని ఆయన స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునేంతవరకూ రైతులు వెనక్కితగ్గరని ఆయన తేల్చి చెప్పారు.
నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన రైతులు, రైతుసంఘాలు ఇవాళ ఉదయాన్నే నేషనల్ హైవే 24ను దిగ్భంధనం చేశారు. దీంతో ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
Delhi: Protesting farmers comfort themselves by lighting bonfire as cold weather conditions continue in the national capital.
Farmers’ protest against Centre’s three farm laws enters 27th day at Singhu border (Delhi-Haryana border) pic.twitter.com/7ECu4zpjhz
— ANI (@ANI) December 22, 2020
సింగు సరిహద్దు ప్రాంతంలో నిన్న జరగాల్సిన రైతు నాయకులతో సమావేశం అనివార్య కారణాలతో జరగలేదు. దీంతో తదుపరి వ్యూహం కోసం ఈ రోజు పంజాబ్ రైతు నాయకులు, జాతీయ రైతు నాయకులతో సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశాలలో, రైతు నాయకులతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది.