ఢిల్లీ డిప్యూటీ సీఎంతో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాకాసి వైరస్ ఎవరిని వదలడంలేదు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.

ఢిల్లీ డిప్యూటీ సీఎంతో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కరోనా

Updated on: Sep 14, 2020 | 8:49 PM

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాకాసి వైరస్ ఎవరిని వదలడంలేదు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆదివారం రాత్రి ఆయనకు కాస్త జ్వరంగా ఉండటంతో ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం నాటి ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే, వైద్యుల సూచనల మేరకు సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సిసోడియా స్వయంగా తెలిపారు. ప్రస్తుతం జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. హోం ఐసోలేషన్ ఉంటున్న తనకు మీ అందరి ఆశీస్సులతో త్వరలో విధుల్లో తిరిగి చేరతానంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పరీక్షలు చేయగా సిసోడియాతో కలిపి ఇప్పటి వరకు ఎనిమిది మంది శాసనసభ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.