ఢిల్లీలో ఒక్కరోజే 3,947 మందికి కరోనా

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఢిల్లీ మూడో స్థానానికి చేరుకుంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 3,947 మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఢిల్లీలో ఒక్కరోజే 3,947 మందికి కరోనా

Updated on: Jun 23, 2020 | 8:51 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఢిల్లీ మూడో స్థానానికి చేరుకుంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 3,947 మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ 68 మంది కరోనా పోరాటంలో ప్రాణాలు వదిలారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,301కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 66,602కు చేరింది. ప్రస్తుతం 24,988 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.