దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి.. అక్షర్ధామ్ ఆలయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకపూజలు

|

Nov 14, 2020 | 11:21 PM

దేశరాజధాని న్యూఢిల్లీ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్షర్ధామ్ ఆలయంలో దీపావళి వేడుకల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి.. అక్షర్ధామ్ ఆలయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకపూజలు
Follow us on

దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జనం గ్రీన్ దీవాలీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ హెచ్చరికలతో వాయుకాలుష్యం పరిరక్షణలో భాగంగా పూజలు, దీపాల వెలుగులతో జనం సరిపెట్టుకున్నారు.

అటు దేశరాజధాని న్యూఢిల్లీ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్షర్ధామ్ ఆలయంలో దీపావళి వేడుకల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన దీపావళి పూజ కార్యక్రమానికి కేజ్రీవాల్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా పాల్గొన్నారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో విరసిల్లాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆకాంక్షించారు.