కాలుష్య ప్రభావం ఏమో కానీ అక్కడి స్కూల్ పిల్లలు పండగ చేసుకుంటున్నారు. అసలు నిజమైన పండుగలకే సరిగ్గా సెలవులు రాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. ఇప్పుడు ఫెస్టివల్స్ లేకున్నా ఢిల్లీ స్కూల్ విధ్యార్ధులకు సెలవులు వస్తున్నాయి. దీనికి కారణం ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం. గత కొద్దిరోజులుగా దేశరాజధానిలో గాలి నాణ్యత క్షీణిస్తూ వస్తోంది. దీంతో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్రత డేంజర్‌గా మారడంతో.. ప్రజలు బయట తిరిగే పరిస్థితి లేకుండా పోతోంది. ఇక ఈ గాలిని పీలిస్తే చిన్న పిల్లలు రోగాల బారిన పడతారని వైద్యులు తెల్పడంతో.. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అటు సుప్రీంకోర్టు కూడా పెరుగుతున్న వాయు కాలుష్యంపై సీరియస్‌గానే ఉంది. వీలైనంత త్వరగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలపై సీరియస్ అయ్యింది. అంతేకాదు ఢిల్లీలోని పాఠశాలలకు నవంబరు 15 వరకు సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్యానెల్ ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే హాట్ మిక్స్ ప్లాట్స్, స్టోన్ క్రషర్స్‌పై ఉన్న నిషేధాన్ని.. మరో రెండు రోజుల పాటు పొడిగించింది.
ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతంలో గాలి నాణ్యత మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరి- బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలపై కూడా నిషేధం విధించింది. అంతేకాదు ఇప్పటికే పలుమార్లు పాఠశాలలకు, కాలేజ్‌లకు సెలవులు ప్రకటించింది కూడా. అయితే తాజాగా రెండు రోజులపాటు స్కూల్స్‌కి సెలవులు ప్రకటించింది. అంతేకాదు.. అత్యవసరమైతేనే తప్ప ఢిల్లీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు NCR పరిధిలోని నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ నగరాలకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. మొత్తానికి వాయు కాలుష్యంతో విద్యార్ధులకు మాత్రం తరచూ సెలవులు వస్తున్నాయి.
Environment Pollution (Prevention and Control) Authority has issued recommendations for Delhi NCR, Schools should remain closed for next 2 days and industries using coal and other such fuels, hot mix plants etc should remain closed till 15th. #AirQuality pic.twitter.com/vs7RBwhEYO
— ANI (@ANI) November 13, 2019