Delaying Refund: ఫెయిల్డ్‌ ట్రాన్సాక్షన్ల రీఫండ్‌ ఎందుకు ఆలస్యమవుతోంది.. ఆర్‌బీఐని ప్రశ్నించిన..

Delaying Refund Of Amount: మనం ఏదైనా ఆన్‌లైన్‌ లేదా కార్డ్‌ ద్వారా చెల్లింపులు చేసినపుడు ట్రాన్సాక్షన్‌ ఫెయిల్డ్‌ అని చూపిస్తుంది. అయితే...

Delaying Refund: ఫెయిల్డ్‌ ట్రాన్సాక్షన్ల రీఫండ్‌ ఎందుకు ఆలస్యమవుతోంది.. ఆర్‌బీఐని ప్రశ్నించిన..

Updated on: Jan 01, 2021 | 8:28 PM

Delaying Refund Of Amount: మనం ఏదైనా ఆన్‌లైన్‌ లేదా కార్డ్‌ ద్వారా చెల్లింపులు చేసినపుడు ట్రాన్సాక్షన్‌ ఫెయిల్డ్‌ అని చూపిస్తుంది. అయితే ఖాతాలో నుంచి డబ్బులు మాత్రం కట్‌ అవుతాయి. తిరిగి ఆ సొమ్మును సదరు బ్యాంకులు కొంత సమయం తర్వాత కస్టమర్‌ ఖాతాలో జమ చేస్తాయి. ఇది మనలో చాలా మందికి జరిగే ఉంటుంది.
అయితే కొన్ని సందర్భాల్లో డబ్బులు రీఫండ్‌ కావడానికి ఎక్కువ సమయం పడుతుంటుంది. ఇదే విషయమై నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌ లైన్‌కు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. సుమారు రెండు వేలకుపైగా కస్టమర్లు తమ అకౌంట్ల నుంచి కట్‌ అయిన నగదు తిరిగి జమ చేయడంలో బ్యాంకులు జాప్యం చేశాయని ఆరోపించారు. దీంతో ఈ విషయంపై స్పందించిన వినియోగదారుల భద్రత ప్రాధికార సంస్థ.. ఈ అంశంలపై జోక్యం చేసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను కోరింది. అకౌంట్ల నుంచి కట్‌ అయిన డబ్బులను వెంటనే ఖాతదారుడికి తిరిగి పంపించేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది.

Also Read: Business News:2021 సంవత్సరం జనవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలుసా?.. పూర్తి వివరాలు తెలుసుకోండి..