రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాషూటింగ్ ను కంప్లీట్ చేసాడు డార్లింగ్. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నాడు.
వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసాడు ప్రభాస్ .. ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ను ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. సినిమా కంటే ముందు ఆదిపురుష్ , సలార్ సినిమాలను ప్రభాస్ చేయబోతున్నాడు. దాంతో నాగ్ అశ్విన్ మూవీ వచ్చే ఏడాది చివరి వరకు ప్రారంభం అయ్యేది లేనిది అర్ధమవుతుంది. వచ్చే ఏడాది రాధేశ్యామ్ సినిమా విడుదల కానుండగా 2022లో ఆదిపురుష్ మరియు సలార్ లు విడుదల అవ్వనుండగా 2023లో నాగ్ అశ్విన్ మూవీ తో ప్రభాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాను అశ్వినీత్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు. చూడాలి మరి ఎం జరుగుతుందో.