న్యూ ఇయర్‌ వేడుకల వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, రేపు ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్ల మూసి వేత

|

Dec 31, 2020 | 8:03 PM

న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 5 గంటల వరకు అవి అమల్లో ఉంటాయి. బేగంపేట, టోలీచౌకి ఫ్లై..

న్యూ ఇయర్‌ వేడుకల వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, రేపు ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్ల మూసి వేత
Follow us on

న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 5 గంటల వరకు అవి అమల్లో ఉంటాయి. బేగంపేట, టోలీచౌకి ఫ్లైఓవర్‌ మినహా నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లై ఓవర్లను మూసి వేస్తారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్‌లో ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఇందులోభాగంగా విస్తృతంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టేందుకు కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 50 డ్రంకెన్‌ డ్రైవ్‌ టీమ్‌లు తనిఖీలు నిర్వహిస్తాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. జీరో ఫ్రీ యాక్సిడెంట్‌ సిటీగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదేవిధంగా సైబర్‌ టవర్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్లు, జేఎన్టీయూ, మైండ్‌ స్పేస్‌, దుర్గంచెరువు తీగల వంతెనను కూడా మూసివేయనున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కార్లు, జీపుల రాకపోకలపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు, సరుకు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు మార్గాల్లో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ పార్టీలకు ఎలాంటి అనుమతి లేవని పోలీసులు స్పష్టం చేశారు. రోజు మాదిరిగానే పబ్బులు, క్లబ్బులు నడుస్తాయని, అయితే – మరోగంట అదనపు సమయానికి అనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.