నీట మునిగిన పడవ.. 54 మంది మృతి..

| Edited By:

Jun 13, 2020 | 4:05 PM

ట్యునీషియాలో ఓ పడవ మునిగి పోవడంతో.. 54 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

నీట మునిగిన పడవ.. 54 మంది మృతి..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుటే.. మరోవైపు ప్రకృతి కూడా పగబట్టినట్లు.. పలుచోట్ల విషాద సంఘనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుంటే.. మరోవైపు కొన్ని చోట్ల భూకంపాలు కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇదిలావుంటే కొన్ని మానవతప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ట్యునీషియాలో ఓ పడవ మునిగి పోవడంతో.. 54 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కొందరి మృతదేహాలు.. ఎస్‌ఫాక్స్‌ నగరానికి సమీపంలో ఉన్న కెర్కెనా దీవుల బీచ్‌ సమీపంలో ప్రత్యక్షమైనట్లు తెలిపారు. మృతులంతా ఆఫ్రికాకు చెందిన వలసదారులుగా గుర్తించారు. కొన్ని నెలలుగా వీరంతా అక్రమంగా సముద్ర మార్గం ద్వారా యూరప్‌ దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సముద్రంలో వెళ్తున్న పడవ మునిగి పోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.