
Dead boody found in suitcase : హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలో సూట్ కేస్ లో మృతదేహం కలకలం రేపింది. డైరీ ఫారం పిల్లర్ నెంబర్ 222 దగ్గర రోడ్ పక్కన నిర్మానుష ప్రాంతంలో సూట్‌కేస్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు సూట్‌కేస్ తెరిచి చూస్తే.. ఓ వ్యక్తి డెడ్‌బాడీ కనిపించింది. అయితే, హంతకులు ఫుల్‌గా తాగి మత్తులో దగ్గర్లోనే చర్చించుకోవడంతో హత్యోదంతం ఈజీగా కొలిక్కి వచ్చింది. మృతుడు చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన రియాజ్ గా గుర్తించారు పోలీసులు. మృతునిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా ఉన్నాయి. హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు కూడా మైనర్లుగా తేల్చారు పోలీసులు.