బిగ్ బ్రేకింగ్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు!

| Edited By:

Jan 22, 2020 | 10:44 PM

ఏపీ శాసనమండలిలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మండలిలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్ పోడియాన్ని ఇరుపక్షాల సభ్యులు చుట్టుముట్టారు. పోడియాన్ని ఎక్కేందుకు కొడాలినాని యత్నించారు. ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనిపై తెదేపా సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదన్న వైసీపీ వ్యూహం విఫలమైంది. […]

బిగ్ బ్రేకింగ్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు!
Follow us on

ఏపీ శాసనమండలిలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మండలిలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్ పోడియాన్ని ఇరుపక్షాల సభ్యులు చుట్టుముట్టారు. పోడియాన్ని ఎక్కేందుకు కొడాలినాని యత్నించారు. ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనిపై తెదేపా సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు.

రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదన్న వైసీపీ వ్యూహం విఫలమైంది. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. అయితే రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆపకుండా శాయశక్తులా ప్రయత్నించింది. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించి బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టింది. అయితే, ఈ బిల్లు విషయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారిపై అనర్హత వేటు వేయడానికి టీడీపీ సిద్ధమౌతోంది.

రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో, రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మందడం రహదారిపైకి జాతీయ జెండాలతో వచ్చి సేవ్‌ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.