Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..

విజయవాడ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్వనమివ్వనున్నారు. తొలిరోజైన నేడు అమ్మవారు స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 5700 […]

ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 29, 2019 | 7:42 AM

విజయవాడ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్వనమివ్వనున్నారు. తొలిరోజైన నేడు అమ్మవారు స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 5700 మంది పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 350 మంది సెక్యూరిటీ సిబ్బంది, 900 మంది వాలంటీర్లు విధుల్లో ఉన్నారు.

మరోవైపు శ్రీశైలంలోనూ నేటి నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలోని వరంగల్‌ శ్రీభద్రకాళి ఆలయంలోనూ కలశస్థాపన, జ్యోతిప్రకాశనంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఇక్కడ 9 రోజుల పాటు అమ్మవారికి ఆరాధన ప్రత్యేక అలకంరణ, పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం విశేష అభిషేక పూజ, ఘటస్థాపనతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం నుంచే అన్ని ఆలయాలల్లోనూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.