అయోధ్య రాముడి తొలి ప్రసాదం ఎవరికో తెలుసా…

అయోధ్య రాముడి తొలి ప్రసాదంను దళిత కుటుంబానికి పంపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రసాదంలో లడ్డూలతో పాటు రామచరిత మానసము, తులసి మాల ఉన్నట్టు తెలుస్తోంది...

అయోధ్య రాముడి తొలి ప్రసాదం ఎవరికో తెలుసా...

Updated on: Aug 06, 2020 | 7:57 PM

అయోధ్య రాముడి తొలి ప్రసాదంను దళిత కుటుంబానికి పంపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రసాదంలో లడ్డూలతో పాటు రామచరిత మానసము, తులసి మాల ఉన్నట్టు తెలుస్తోంది. అయోధ్యలోని సుధతి ప్రాంతంలో ఉంటున్న మహవీర్ కుటుంబానికి ఈ లబ్బు ప్రసాదం పంపించారు. మహవీర్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. 2019లో తొలిసారి సీఎం యోగి ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడే భోజనం చేసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా తనకు అయోధ్య రాముడి తొలి ప్రసాదం అందడంపై మహవీర్ అమితానందాన్ని వ్యక్తం చేశారు. నన్ను గుర్తు పెట్టుకున్నందుకు ఆయనకు రుణపడివుంటాను అని మహవీర్ అన్నారు. ప్రస్తుతం మేము రెండింతలు సంతోషంతో ఉన్నాం. ఒకటి రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడమైతే, రెండోది తొలి ప్రసాదం మాకే అందడ అని అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us