ర్యాన్‌బాక్సీ ఓన‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్‌

| Edited By:

Apr 05, 2019 | 3:53 PM

న్యూఢిల్లీ : ఫార్మాసిటిక‌ల్ కంపెనీ ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జ‌పాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని సుప్రీం హెచ్చరించింది. ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ మోహ‌న్ సింగ్‌, ఆయ‌న సోద‌రుడు శివింద‌ర్ మోహ‌న్ సింగ్‌లపై జపాన్ కంపెనీ కేసు వేసింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ కేసు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇవాళ సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ తెలిపారు. ఒక‌వేళ మాజీ యజమానులు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే, వారికి జైలు శిక్ష […]

ర్యాన్‌బాక్సీ ఓన‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్‌
Follow us on

న్యూఢిల్లీ : ఫార్మాసిటిక‌ల్ కంపెనీ ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జ‌పాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని సుప్రీం హెచ్చరించింది. ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ మోహ‌న్ సింగ్‌, ఆయ‌న సోద‌రుడు శివింద‌ర్ మోహ‌న్ సింగ్‌లపై జపాన్ కంపెనీ కేసు వేసింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ కేసు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇవాళ సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ తెలిపారు. ఒక‌వేళ మాజీ యజమానులు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే, వారికి జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అవ‌కాశం ఇచ్చినా.. ర్యాన్‌బాక్సీ ఓన‌ర్లు బ‌కాయిలు ఎందుకు చెల్లించ‌డంలేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది.