అతి తీవ్ర తుఫాన్‌గా ‘ఫొని’ మారింది. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 990 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1170 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైన ఫొని.. వాయువ్య దిశగా కదులుతోంది. తీరం సమీపంలోకి వచ్చిన తర్వాత దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.