దేశ ఆర్థికాభివృద్ధిలో కస్టమ్స్ విభాగం కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్ డే-2021 వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. కొవిడ్-19 లాక్‌డౌన్ సంక్షోభ సమయంలో కస్టమ్స్ విభాగం అద్భుత సేవలందించిందన్నారు. సమర్థవంతమైన సరఫరా చైన్ సిస్టం ద్వారా కస్టమ్స్ విభాగం ముఖ్యపాత్ర పోషిందని పేర్కొన్నారు.