ఇట్స్ అఫీషియల్: చెన్నై అభిమానులకు కిక్కిచ్చే వార్త.. ఐపీఎల్ 2021లో సీఎస్‌కేతోనే సురేష్ రైనా..

|

Dec 24, 2020 | 4:59 PM

Suresh Raina CSK: ఐపీఎల్ 2021కు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం అదిరిపోయే న్యూస్ అందించింది.

ఇట్స్ అఫీషియల్: చెన్నై అభిమానులకు కిక్కిచ్చే వార్త.. ఐపీఎల్ 2021లో సీఎస్‌కేతోనే సురేష్ రైనా..
Follow us on

Suresh Raina CSK: ఐపీఎల్ 2021కు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం అదిరిపోయే న్యూస్ అందించింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో సురేష్ రైనా తిరిగి జట్టులోకి చేరుతాడని.. సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారి ఒకరు వెల్లడించినట్లు జాతీయ మీడియా ముంబై మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది.

‘అతడు మాతోనే ఉంటాడు. సీఎస్కే‌ యాజమాన్యానికి అతడ్ని దూరం పెట్టాలనే ఆలోచన లేదు’ అని ఆ అధికారి తెలిపారు. రైనా అరెస్ట్ గురించి తెలిసిందని.. ఆది రైనాపై ఎలాంటి ప్రభావం చూపించదని పేర్కొన్నాడు. కాగా, సీఎస్‌కే మళ్లీ రైనాను జట్టులోకి తీసుకోవాలంటే కొత్తగా ఒప్పందం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే వ్యక్తిగత కారణాల వల్ల రైనా ఈ ఏడాది ఐపీఎల్ ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా.. మళ్లీ జనవరిలో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నమెంట్‌తో బరిలోకి దిగనున్నాడు.

Also Read:

యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట

‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..

బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్