ఉత్తర భారతాన్ని వణికిస్తున్న కాలుష్య భూతం

|

Sep 21, 2020 | 3:52 PM

శీతాకాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది కానీ.. ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఆరంభ చలికాలం నరకాన్ని చూపిస్తుంటుంది.. విపరీతమైన కాలుష్యమే అందుకు కారణం.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో..

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న కాలుష్య భూతం
Follow us on

శీతాకాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది కానీ.. ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఆరంభ చలికాలం నరకాన్ని చూపిస్తుంటుంది.. విపరీతమైన కాలుష్యమే అందుకు కారణం.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం జనాలకు ఇబ్బంది పెడుతుంటుంది.. అసలే ఇది కరోనా కాలం.. దీనికి కాలుష్యం తోడైతే ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. కరోనా పేషంట్ల ఊపిరితిత్తులపై ఇది పెను ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాది చలికాలం ఆరంభంలో పంట మొదళ్లను తగలబెట్టడం పంజాబ్‌, హర్యానాలకు ఆనవాయితీగా మారింది.. ఎవరు ఎంతగా చెప్పినా రైతులు వినిపించుకోవడం లేదు.. ఫలితం ఢిల్లీతో పాటు ఉత్తరభారతంలో కొన్ని ప్రదేశాలు కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నాయి.. కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువులు వాతావరణంలో పెరిగిపోతున్నాయి. ఫలితంగా శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా బాధితుల ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం కూడా ఉంది. పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదని, పైగా నేలలో ఉండే సిలికాన్‌ కూడా తగ్గిపోతుందని ఎంతగా చెబుతున్నా రైతులు మాత్రం వినడం లేదు.. సిలికాన్‌ తగ్గితే మనిషిలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. రైతుల మీద కేసులు పెట్టినా వారు ఈ అలవాటు మానడం లేదు. నిరుడు పంజాబ్‌లో ఇలా పంట మొదళ్లను తగులపెట్టిన 50 వేల మందిపై కేసులు పెట్టారు.. కాలుష్యం కారణంగా హర్యానా, పంజాబ్‌లతో పాటు ఢిల్లీకి కూడా తీవ్రంగా నష్టపోతున్నది..