Crime News Latest: నూజివీడు ట్రిపుల్ ఐఐటీ ఘటన మరువక ముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఓ గర్ల్స్ హాస్టల్‌లోకి యువకుడు చొరబడటం స్థానికంగా కలకలం రేపింది. ఆ యువకుడికి సన్నిహితంగా ఉన్న ఒక బాలిక గదిలో రాత్రంతా ఉన్నాడు. అంతేకాక ఆ గదిలో మరో ముగ్గురు బాలికలు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే..
Also Read: వింత వైరస్ ఎఫెక్ట్: 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..
ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు కొమరం భీం జిల్లాకు చెందిన ఓ యువకుడు నార్నూర్ మండలంలోని బాలికల వసతి గృహం ప్రహరీ గోడ దూకి, వెంటిలేటర్ ద్వారా చేరుకున్నాడు. ఇక ఆ యువకుడి గ్రామానికి చెందిన ఓ బాలిక ఆ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ద్వీతీయ సంవత్సరం చదువుతుండటంతో ఆమె గదిలో రాత్రంతా ఎవరికి తెలియకుండా ఉన్నాడు.
Also Read: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై ఆన్లైన్‌లో ఫారెన్ లిక్కర్..!
మరుసటి రోజు గదిని శుభ్రం చేసే సిబ్బంది అతడ్ని చూసి ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. ఎంఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి యువకుడికి, విద్యార్థినికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాక ఆ గదిలో ఉండే మరో ముగ్గురు బాలికలను కూడా పాఠశాల సిబ్బంది సస్పెండ్ చేశారు.
Also Read: యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. కేవలం రూ.5కే నెల సబ్‌స్క్రిప్షన్.!